ఆంధ్రప్రదశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి  గవర్నర్ నరసింహన్ ఉభయసభలనుద్దేశించి ప్రసగించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సభ్యులు 2 నిమిషాలపాటు మౌనం పాటించి మహాత్ముడికి నివాళులర్పించారు.

గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

* శాంతిభద్రతల పరిరక్షణకు టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం

* 1.1 మిలియన్ నుంచి 5.5 మిలియన్లకు పెరిగిన విమానయాన ప్రయాణికులు

* రూ.20 వేల కోట్లతో అమరావతి-అనంతపురం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ వే

* 4 వేల గ్రామాల్లో 6 లక్షల కుటుంబాలకు ఫైబర్‌గ్రిడ్‌ అనుసంధానం

* రాజధానిలో అభివృద్ధి చేసిన భూమి యజమానులకు అప్పగింత

* రాజధానిలో మొదటి దశలో రూ. 51,687 కోట్లతో మౌలిక వసతుల కల్పన

* ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ దేశంలోనే ముందంజలో ఉంది

* 2019 నాటికి పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీటి విడుదల

* ఆకర్షణీయ నగరాలుగా విశాఖ, కాకినాడ, తిరుపతి, అమరావతి

* పారిశ్రామిక రంగంలో 8.49 శాతం అభివృద్ధి

* పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ముందంజలో ఉంది

* పెట్టుబడుల ద్వారా ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిస్తున్నాం

* కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం

* రూ.1.82 లక్షల కోట్ల పెట్టుబడితో 820 మెగా ప్రాజెక్టుల నిర్మాణం

* కేంద్రం సహకరించకపోయిన ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశాం

* మొత్తం రూ.15.77 లక్షల కోట్ల పెట్టుబడితో, 33.30 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో 2,633 ప్రాజెక్టులు

* కియా కార్ల ప్లాంట్‌తో అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోతాయి

* కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా ఏపీ

* రెన్యూవబుల్ ఎనర్టీ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాం

* రాష్ట్రంలో మూడు కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మిస్తున్నాం

* ఎన్టీఆర్ భరోసా కింద నెలకు రూ.556.41 కోట్లతో 50.51 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు 

* 2014-15 నుంచి 2018-19 వరకు రూ.24,618 కోట్ల మొత్తం పంపిణీ చేశాం

* 2022 నాటికి దేశంలోని 3 అత్యుత్తమ రాష్ట్రాల్లో ఏపీని ఒకటిగా మార్చాలన్నది లక్ష్యం

* అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5 కే భోజనం అందిస్తున్నాం

* కాంక్రీట్ పనుల ద్వారా పోలవరం ప్రాజెక్ట్‌కు గిన్నిస్ అవార్డ్

* నదుల అనుసంధానం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

* మహాసంగమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని నదుల్ని అనుసంధానిస్తాం

* ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం

* ఎన్టీఆర్ వైద్య సేవ కింద నిరుపేదలకు వైద్య సేవలందిస్తున్నాం

* పొరుగు రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి ఏపీ చేరే వరకూ కేంద్రం చేయూత అవసరం

* వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకోవడం ఊహించని పరిణామం

* 13 జిల్లాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశాం

* రూ.2 వేలకే డయాలసిస్ సేవలు అందిస్తున్నాం.

* విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నాం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నాం

* నాణ్యతా ప్రమాణాల్లో ఏపీ యూనివర్సిటీలు ముందంజలో ఉన్నాయి.

* ఆటో, ట్రాక్టర్లపై జీవిత పన్ను రద్దు చేశాం

* పది శ్వేత పత్రాలతో రాష్ట్ర పరిస్థితిని ప్రజల ముందుంచాం

* పది శాతం ఈబీసీ కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం

* వ్యవసాయ రంగ అభివృద్ధిలో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉన్నాం

* హార్టికల్చర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాం, రాయలసీమను హార్టికల్చర్‌కు హాబ్‌గా మారుస్తాం.

* రెండు వారాల్లో తుది విడత రుణమాఫీ అమలు చేస్తాం

* రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నాం

* మత్య్స రంగం 33 శాతం వృద్ధి సాధించింది

* చేపల ఉత్పత్తిలో దేశంలోనే మనం ముందంజలో ఉన్నాం

*  రాబోయే ఐదేళ్లు సంతృప్తస్థాయిపై విజన్ రూపొందించాం

* ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రూ.1000 నుంచి రూ.2 వేలకు పెంచాం

* ఆకస్మాక మరణాలతో ఆప్తుల్ని కోల్పోయిన వారిని ఆర్ధికంగా ఆదుకుంటున్నాం

* రాష్ట్రాన్ని కరువు రహిత ప్రాంతంగా తయారు చేస్తున్నాం

* ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్‌కు అత్యధిక ప్రాధాన్యం

* అవినీతిరహితంగా, పారదర్శకంగా పాలన అందిస్తున్నాం.

* సంతృప్త స్థాయిలో సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం

* వ్యవసాయం అనుబంధ రంగాల్లో 11 శాతం వృద్దిరేటు నమోదు

* అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం

* అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధ్యమైంది.

* టెక్నాలజీ సాయంతో సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాం

* అనేక రంగాల్లో ఇప్పటికే సంతృప్త స్థాయిని సాధించాం

* కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు

* కేంద్రం మద్దతు లేకపోయినా అభివృద్ధిలో దూసుకెళ్తున్నాం

* మౌలిక వసతులు, సేవా రంగాల్లో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోంది.

* 2050 నాటికి ప్రపంచంలోనే ప్రముఖ ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది.

* ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు రెట్టింపు చేశాం

* సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.

* 2029 కల్లా ఏపీ నెంబర్‌వన్‌ రాష్ట్రంగా అవతరిస్తుంది.

* ఎన్టీఆర్ స్పూర్తితో పాలన కొనసాగుతోంది.

* నాలుగున్నరేళ్లలో విభజన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు

* ఆంధ్రప్రదేశ్ విభజన అసంబద్ధంగా జరిగింది.