హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇప్తార్ విందు ఇవ్వనున్నారు. ప్రతీ సంవత్సరం రాజ్ భవన్ లో ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 

అయితే ఈ ఏడాది కూడా ఇఫ్తార్ విందు శనివారం ఇవ్వాలని నరసింహన్ నిర్ణయించారు. ఇఫ్తార్ విందు ఇస్తున్న సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ లతోపాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. 

ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నారు ఏపీ సీఎం వైయస్ జగన్. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి గవర్నర్ నరసింహన్ ఇచ్చే ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. 

ఇఫ్తార్ విందు సందర్భంగా రాజ్ భవన్ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే జూన్ 3న ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఆ ఇఫ్తార్ విందులో ఏపీ సీఎం వైయస్ జగన్ పాల్గొంటారు.