హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు. రాష్ట్రంలో పెథాయ్ తుఫాన్ ప్రభావంపై చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ దాటికి ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో అన్న అంశాలపై ఆరా తీశారు. 

అలాగే పెథాయ్ తుఫాన్ నేపథ్యంలో ప్రాణ నష్టం, ఆస్థి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబును కోరారు. ఇకపోతే గవర్నర్ నరసింహన్ ఆదివారం తిరుపతికి వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారిని గవర్నర్ దంపతులు దర్శించుకోనున్నారు. 

ఇకపోతే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉంది. పెథాయ్ తుఫాన్ ప్రస్తుతం చెన్నైకి 775 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. 
ఈ తుఫాన్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ-ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ నెల 17 సాయంత్రం పెథాయ్‌ తీరం దాటనుంది. తూర్పుగోదావరి జిల్లా కోస్తాంధ్రల మధ్య తుఫాన్ తీరం దాటనుంది.