అమరావతి: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ విజయవాడ చేరుకున్నారు. గురువారం ఏపీ రెండో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డిచేత ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ నరసింహన్ ఒక రోజు ముందే విజయవాడకు చేరుకున్నారు. 

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న గవర్నర్ నరసింహన్ కు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తోపాటు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్ లుస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా గవర్నర్ నరసింహన్ విజయవాడలోని తాజ్ గేట్ వే హోటల్ కు చేరుకున్నారు. 

తాజ్ గేట్ వే హోటల్ లో రాత్రికి బస చేయనున్నారు గవర్నర్ నరసింహన్. సాయంత్రం 6.30 గంటలకు తాజ్ గేట్ వే హోటల్ లో వైయస్ జగన్ మర్యాదపూర్వకంగా గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. అనంతరం 7 గంటలకు కనకదుర్గమ్మను దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకోనున్నారు నరసింహన్.