పవన్ కు 2+2 భ్రదత: త్వరలో జనాల్లోకి ?

First Published 26, Mar 2018, 4:17 PM IST
Government provides 4 gunmen to pawankalyan
Highlights
గుంటూరు బహిరంగసభ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, తనకు భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేసిన సంగతి అందరకీ తెలిసిందే.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ కు ప్రభుత్వం దిగొచ్చింది. ఏ విషయంలో అంటారా అదేలేండి భద్రత కల్పించే విషయంలోనే. పవన్ కు ప్రత్యేకంగా నలుగురు గన్ మెన్లను చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గుంటూరు బహిరంగసభ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, తనకు భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేసిన సంగతి అందరకీ తెలిసిందే.

ఇన్ని రోజుల తర్వత పవన్ రోజువారీ కార్యక్రమాలను సమీక్షించిన ప్రభుత్వం మొత్తానికి రెండు షిఫ్టుల్లో భద్రత కల్పించేట్లుగా 4గురు భద్రతా సిబ్బందిని నియమించింది.

ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా బహుశా పవన్ ఎక్కువగా జనాల్లోనే ఉండాలని నిర్ణయించారు. అందుకనే తనకు భద్రత కల్పించాలంటూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ డిజిపికి లేఖ రాసారు. పవన్ ఆలోచనలను గమనిస్తుంటే ప్రత్యేకహోదా డిమాండ్ తో త్వరలోనే జనాల్లోకి వచ్చేట్లే ఉన్నారు. బహుశా పాదయాత్రంటారో లేకపోతే గతంలో చెప్పినట్లుగా నిరాహారదీక్షలంటారో మాత్రం స్పష్టత లేదు.

loader