ఇకపై 50యేళ్లు నిండితేనే ఒంటరి మహిళలకు పెన్షన్.. మారిన రూల్స్..

ఏపీ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాలలో ఒంటరి మహిళ పెన్షన్ పొందాలంటే 50 ఏళ్లు నిండి ఉండడమే కాదు ఖచ్చితంగా దారిద్ర్య రేఖ దిగువన ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

government increased pension eligibility age for single women to 50 years in andhra pradesh

అమరావతి : ఏపీ లోని ఒంటరి మహిళలకు అలర్ట్.  వైయస్సార్ పింఛను కానుక పథకం గైడ్లైన్స్ లో జగన్ సర్కార్ మార్పులు చేసింది. ఈ స్కీం కింద ఒంటరి మహిళలకు, భర్త నుంచి విడిపోయిన, వివాహం కాని స్త్రీలకు ఇచ్చే పెన్షన్ అర్హత వయస్సును పెంచింది.  ఇప్పటివరకు 35 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తుండగా ఇకపై కొత్తగా అప్లై చేసుకునే వారికి యాభై ఏళ్లు దాటితేనే పింఛన్ ఇస్తామని వెల్లడించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. భర్తను వదిలి లేదా భర్త వదిలేసి కనీసం సంవత్సరం గడిచిన తర్వాత పెన్షన్కు అర్హులు అవుతారని ఉత్తర్వుల్లో వెల్లడించారు. సదరు మహిళ ఒంటరిగా ఉంటున్నట్లు తగిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలని స్పష్టం చేశారు.

అవివాహిత మహిళలకు కూడా…
అవివాహిత మహిళ పెన్షన్ అర్హత వయస్సును సైతం ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో అవివాహిత మహిళలకు 30 ఏళ్లకే పెన్షన్ ఇస్తుండగా ఈ వయసును కూడా 50 ఏళ్లకు పెంచారు.  అర్బన్ ఏరియాలో అవివాహిత మహిళ అర్హత వయస్సును సైతం 35 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచింది ప్రభుత్వం. పెన్షన్ పొందాలంటే పెళ్లి కాలేదని ధ్రువీకరణ పత్రాన్ని స్థానిక తహసీల్దార్ నుంచి తీసుకుని సమర్పించాలని స్పష్టం చేసింది. అవివాహిత మహిళలకు కుటుంబం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోతేనే పెన్షన్ వస్తుందని తెలిపింది. ఈ రూల్స్ కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒంటరి మహిళల విభాగంలో అర్హులైన వారికి ప్రస్తుతం నెలకు రూ. 2,500 చొప్పున పెన్షన్ ఇస్తుంది ప్రభుత్వం. 

అందంగా ముస్తాబై పెళ్లిదుస్తుల్లో ఫించన్ల పంపిణీ... నెల్లూరు వాలంటీర్ పనికి నెటిజన్లు ఫిదా..!

ఇదిలా ఉండగా, పెన్షన్లు పంపిణీ చేయడంలో ప్రత్యేకత చాటుకుంటూ కొందరు వాలంటీర్లు తమ పనితీరుతో  ప్రశంసలు పొందుతున్నారు. జూన్ 2న నెల్లూరు జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ పెళ్లిరోజున కూడా ప్రజాసేవ చేసి.. ఆ తరువాతే పెళ్లి పీటలెక్కి అందరి మన్ననలందుకుంది. ఆమె అంకితభావాన్ని చూసి వాలంటీర్ వ్యవస్థను విమర్శించేవారు కూడా ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామానికి చెందిన కె.రమాదెవి వాలంటీర్ గా పనిచేస్తుంది. అయితే ఇటీవల ఆమెకు పెళ్లి నిశ్చయమయ్యింది. జూన్ 1న మంచి ముహూర్తం వుండటంతో పెళ్లికి పెద్దలు నిశ్చయించారు. పెళ్లికి అన్ని అన్ని ఏర్పాటు కూడా జరిగిపోయాయి. 

అయితే,  ప్రతినెల ఒకటవ తేదీన తప్పకుండా ప్రజలకు పించన్లు అందించే వాలంటీర్ ఉద్యోగం చేస్తున్న ఆమె ఆ రోజు కూడా తన విధి నిర్వర్తించింది. రమాదేవి పెళ్ళిరోజున కూడా గ్రామంలో ఫించన్ల పంపిణీ చేపట్టింది. పెళ్లికూతురిగా ముస్తాబయిన ఆమె ఇంటింటికీ తిరిగి లబ్దిదారులకు ఫించన్ డబ్బులు అందించింది.  ఫించన్ల పంపిణి పూర్తయిన తరువాతే పెళ్లి మండపానికి చేరుకుతుంది.  ఇలా పెళ్లికూతురి గెటప్ లో ఫించన్ పంపిణీ చేస్తుండగా ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆమె ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. తన వృత్తిపట్ల చూపిన అంకితభావం అందరినీ ఆకట్టుకుంది. దీంతో రమాదేవిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios