ఖమ్మం: ఖమ్మం హాస్టల్‌లో చోటు చేసుకొన్న ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.  షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే.

ఆదివారం నాడు ఖమ్మం హస్టల్ లో చోటు చేసుకొన్న సార్ట్ సర్క్యూట్ తో  స్పందన అనే విద్యార్ధిని మృతి చెందింది. స్థానికులు సకాలంలో స్పందించడంతో   చాలా మంది విద్యార్ధినులు సురక్షితంగా బయటపడ్డారు.

ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.  ఈ  విషయమై విచారణకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. హాస్టల్‌లో సార్ట్‌ సర్క్యూట్ కు గల కారణాలపై ఆరా తీయనుంది.  భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోనుంది.