ఒంటిమిట్టలోని శ్రీకొందడరాముని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీసీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ లు ఆలయానికి వచ్చారు.

ముందుగా ఆలయానికి చేరకున్న గవర్నర్ నరసింహన్ కు టీటీడీ తిరుపతి జేఈవో లక్ష్మీకాంతం, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. గవర్నర్ కి శేషవస్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంత‌రం స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాలు, ఒంటిమిట్ట రాముల‌వారి చిత్ర‌ప‌టం అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా గౌ.. గ‌వ‌ర్న‌ర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ సీతారాముల క‌ల్యాణాన్ని వెన్నెల్లో జ‌ర‌ప‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై శ్రీరాముని ఆశీస్సులు మెండుగా ఉండాల‌ని ఈ సంద‌ర్భంగా ప్రార్థించిన‌ట్టు తెలిపారు.