క్రైస్తవుడైన భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించడం పట్ల గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్‌కు హిందూ ధర్మంపై ఎందుకంత కోపమని దుయ్యబట్టారు. ఎన్నికల్లో అఫిడవిట్‌లో తాను క్రిస్టియన్‌ను అని స్పష్టంగా పేర్కొన్న కరుణాకర్ రెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించడం దారుణమన్నారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియామకం వివాదాస్పదమవుతోంది. ఆయన క్రైస్తవుడని, గతంలో శ్రీవారి విగ్రహాన్ని నల్లరాయి అన్నారని, ఆయనకు ఏడుకొండలు ఎందుకు అంటూ వ్యాఖ్యానించారని విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు హిందూ ధర్మంపై ఎందుకంత కోపమని రాజాసింగ్ మండిపడ్డారు. ఎన్నికల్లో అఫిడవిట్‌లో తాను క్రిస్టియన్‌ను అని స్పష్టంగా పేర్కొన్న కరుణాకర్ రెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించడం దారుణమన్నారు. హిందువులనే టీటీడీ ఛైర్మన్‌గా నియమించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఏపీలోని హిందువులు మేల్కోవాలని.. లేకపోతే నష్టం తప్పదని ఆయన హెచ్చరించారు.

అంతకుముందు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సైతం భూమన కరుణాకర్ రెడ్డని టీటీడీ ఛైర్మన్‌గా నియమించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ పదవి అనేది రాజకీయ పునరావాస పదవి కారాదు అని అన్నారు. హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లే టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి న్యాయం చేయగలరని అన్నారు. టీటీడీ చైర్మన్ పదవికి హిందూ ధర్మంపై నమ్మకమున్న వారిని, అనుసరించే వాళ్లని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పురందేశ్వరి ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. 

ALso Read: టీటీడీ చైర్మన్ పదవికి హిందూ ధర్మాన్ని అనుసరించేవారినే నియమించాలి: పురందేశ్వరి

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ అన్నది రాజకీయ పునరావాస పదవి కారాదు. హిందూ ధర్మంపై నమ్మకమున్నవాళ్లే ఈ పదవికి న్యాయం చేయగలరు. ఇంతకు ముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేయడం జరిగింది. ఈ విషయం పై గలం విప్పిన తరువాత 52 మంది నియామకం నిలిపి వేయడం జరిగింది. అంటే ప్రభుత్వం ఈ నియామకాలను రాజకీయ పునరావాస నియామకాలుగానే పరిగణిస్తున్నదని అర్ధమవుతున్నది. కనుక టీటీడీ చైర్మన్ పదవికి హిందూ ధర్మంపై నమ్మకమున్న వారిని, హిందూ ధర్మం అనుసరించే వాళ్ళని నియమించాలి’’ అని పురందేశ్వరి పేర్కొన్నారు.