అమరావతి: ఆంధ్రప్రదేశ్ జగన్ నివాసానికి, క్యాంపు కార్యాలయానికి సంబంధించి వివిధ పనులకు సంబందించిన నిధుల కేటాయింపు జీవోలను ప్రభుత్వం నిలుపుదల చేసింది. 

తాడేపల్లి తో పాటు హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసానికి సెక్యూరిటీ కోసం కేటాయించిన నిధుల జీవో లను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం తాడేపల్లి నివాసం కోసం ఫర్నిచర్ కొనుగోలు, విద్యుత్ సౌకర్యం, ఇతర వసతుల కోసం నిధులు కేటాయిస్తూ ఇటీవల జీవో విడుదలైంది. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. దీంతో 

సుమారు 3కోట్ల విలువైన పనులకు సంబందించిన కేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. ముఖ్యమంత్రి నివాసానికి ఏర్పాట్ల కోసం  ప్రభుత్వమే నిధులు భరించాల్సి ఉన్నప్పటికీ జగన్ అందుకు అంగీకరించలేదు. జగన్ ఆదేశాల మేరకు ఆరు జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది. 

జగన్ నివాసానికి, క్యాంపు కార్యాలయానికి నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం 6 జీవో లు విడుదల చేసింది. అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆ జీవోలను రద్దు చేయాలని జగన్ ఆదేశించినట్లు చెబుతున్నారు.