Asianet News TeluguAsianet News Telugu

రాజమండ్రి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఏపీలో నేడు పలు రైళ్లు రద్దు..

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి రైల్వే స్టేషన్‌ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం  ఏర్పడింది. 

goods train derailed near rajahmundry several train services affected in Andhra Pradesh
Author
First Published Nov 9, 2022, 9:26 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి రైల్వే స్టేషన్‌ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పక్కకు పడిపోయింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం  ఏర్పడింది. ప్రస్తుతం ఒకే ట్రాక్ ఇతర రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. రైలు బోగీలను పట్టాలపై నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. 

గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో.. ఆ మార్గంలో పలు రైలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గుంటూరు-విశాఖపట్నం మధ్య రైళ్లు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఇక,   దక్షిణ మధ్య రైల్వే  ఈరోజు 9 రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. అలాగే రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్టుగా, ఒక రైలును రీషెడ్యూల్ చేస్తున్నట్టుగా తెలిపింది. ఈ మేరకు విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 

విజయవాడ- విశాఖపట్నం (12718), విశాఖపట్నం- విజయవాడ (12717), గుంటూరు- విశాఖపట్నం (17239), విశాఖపట్నం- గుంటూరు (17240), విశాఖపట్నం- విజయవాడ (22701), విజయవాడ- విజయవాడ (22702), విజయవాడ -గుంటూరు (07628), గుంటూరు- విజయవాడ (07864), కాకినాడ పోర్టు- విజయవాడ (17257) రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది. విజయవాడ- లింగంపల్లి (12805) రైలును 120 నిమిషాలు ఆలస్యంగా నడపనున్నట్టుగా  తెలిపింది. 

 


కాకినాడ పోర్టు- విజయవాడ (17258) రైలును కాకినాడ టౌన్, విజయవాడ మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్టుగా, విజయవాడ- రాజమండి (07768) రైలును తాడేపల్లిగూడెం, రాజమండ్రి మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్టుగా రైల్వే శాఖ తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios