శ్రీవారి భక్తులకు శుభవార్త.. నేడు నేరుగానే స్వామివారి దర్శనం...
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు శ్రీవారి దర్శనం నేరుగానే జరగనుంది. నేటితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
తిరుపతి : తిరుమల లో భక్తుల రద్దీ బాగా తగ్గడం వల్ల మంగళవారం నాడు భక్తులకు శ్రీవారి దర్శనానికి నేరుగానే అనుమతి లభిస్తుంది. శ్రీవారి భక్తులకు ఇది శుభవార్త. అంతేకాదు శ్రీవారి సర్వదర్శనానికి కేవలం గంట సమయం మాత్రమే పడుతుంది. సోమవారం నాడు 72,137 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం నాడు శ్రీవారి హుండీ ఆదాయం 3.37 కోట్లు వచ్చినట్టుగా టీటీడీ వెల్లడించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేడు చివరి రోజుకు చేరుకున్నాయి.