EWS అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఫ్రీ కోచింగ్

ఇటీవలి కాలంలో 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) కేటగిరీకి చెందిన విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్ లభించింది. ఈ రాజ్యాంగ సవరణను అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం రిజర్వేషన్‌ను విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో కల్పించేందుకు జీఓ నెంబర్‌ 65, జీఓ నెంబర్‌ 66 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.

Good news for EWS candidates.. Free coaching from now on GVR

ఆంధ్రప్రదేశ్‌లోని 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వాటి ద్వారా నిరుద్యోగులైన విద్యార్థినీ, విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి కోచింగ్ ప్రోగ్రాములను ప్రభుత్వం నిర్వహిస్తోంది. నిర్దేశించిన కోటా ప్రకారం వివిధ కేటగిరీలకు చెందిన విద్యార్థులకు స్టడీ సర్కిళ్లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆయా స్టడీ సర్కిళ్లలో బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం మేర కోటా ఉంది.

కాగా, ఇటీవలి కాలంలో 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) కేటగిరీకి చెందిన విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్ లభించింది. ఈ రాజ్యాంగ సవరణను అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం రిజర్వేషన్‌ను విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో కల్పించేందుకు జీఓ నెంబర్‌ 65, జీఓ నెంబర్‌ 66 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఎ. కృష్ణ మోహన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ నేపద్యంలో బీసీ స్టడీ సర్కిళ్లలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులకు కూడా కోటా ఏర్పాటు చేసి... కోచింగ్ సదుపాయాన్ని కల్పించాలని ఆయా వర్గాల విద్యార్థుల నుంచి ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీసీ స్టడీ సర్కిళ్లలో 10 శాతం రిజర్వేషన్‌ను సూపర్ న్యూమరరీ పద్ధతిలో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు కల్పించడానికి తగు ప్రతిపాధనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేస్తుందని తెలిపారు. 

కాగా, 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా యువతకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెట్టారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ కూడా విడుదల చేశారు. టెట్‌ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఉచిత శిక్షణకు అర్హులెవరు?

బీసీ స్టడీ సర్కిళ్లలో బీసీలతో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉచిత శిక్షణ పొందవచ్చు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఓబీసీలకు కూడా ఈ స్టడీ సర్కిళ్లలకు అవకాశం లభిస్తుంది. కాగా, ప్రతిభ ఆధారంగా బీసీ సంక్షేమ శాఖ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఆయా జిల్లాల పరిధిలోని ఔత్సాహికులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన అభ్యర్థులు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో శిక్షణ కేంద్రంలో పరిమిత సంఖ్యలోనే శిక్షణ ఇస్తారు. దీనికి సంబంధించి జిల్లాల వారీగా బీసీ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ ఇస్తుంది. దాని ప్రకారం దరఖాస్తు చేసుకొని ఉచిత శిక్షణ పొందవచ్చు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు శిక్షణ నిపుణులు శిక్షణ తరగతులు బోధిస్తారు. ట్రైనింగ్‌ పీరియడ్‌లో 75శాతం హాజరుంటే అభ్యర్థులకు రూ.3 వేలు స్టైపెండ్, ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను ప్రభుత్వం అందిస్తుంది. కోచింగ్‌కు చేరాలనుకున్న విద్యార్థులు విద్యార్హత, కుల, ఆదాయ ధ్రువపత్రాలతో పాటు పలు వివరాలు అందజేయాల్సి ఉంటుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios