గుడ్ మార్నింగ్ సీఎం సార్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ రోజు మరో వ్యంగ్య కార్టూన్ ను ట్వీట్ చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. 

అమలాపురం : ఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల దుస్థితిని తెలుపుతూ.. ముఖ్యమంత్రిని మేల్కొలిపే #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్ ను జనసేన ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు మరో వ్యంగ్య కార్టూన్ ట్వీట్ చేశారు. శుక్రవారం ఉదయం 8 గం.కు పవన్ కళ్యాణ్ రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళే రోడ్డు దుస్థితిని తెలిపే వీడియోను ట్విటర్ లో పోస్టు చేశారు. ఈ వీడియోలో కొత్తపేట దగ్గర ఉన్న గుంతలు, అక్కడి పరిస్థితి తెలుస్తోంది. ఈ వీడియోను పోస్టు చేస్తూ #GoodMorningCMSir అని హ్యాష్ ట్యాగ్ వేశారు. 

రోడ్డు మీద ప్రయాణం సర్కస్ ఫీట్ 
దీంతోపాటు రాష్ట్రంలో రోడ్డు ప్రయాణం ఎంత నరకప్రాయంగా మారిందో తెలియచేసేలా ఉన్న వ్యంగ్య చిత్రాన్నిపవన్ కళ్యాణ్ గారు పోస్టు చేశారు. హెలికాప్టర్ లో వెళ్తున్న సీఎం రోడ్డు మీద ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వాళ్ళను వింతగా చూస్తుంటారు. ఒక్కో గోతిలో నుంచి గాల్లో ఎగిరి అంతా దూరాన మరో గోతిలో ఉన్న నీళ్ళలో పడుతుంటే వారి వాహనాలు గాల్లో ఉన్నట్లు ఆ వ్యంగ్య చిత్రం ఉంది. రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణిస్తున్నవారిని పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఆ కార్టూన్ తెలియచేస్తుంది. 

‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’.. ఏపీ రోడ్ల దుస్థితి, జగన్ మీద పవన్ కల్యాణ్ ట్వీట్ వైరల్...

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవలి కాలంలో రోడ్లు బాగా పాడయ్యాయని.. రోడ్లు వేయండి మహాప్రభో అని ప్రజలు గగ్గోలు పెడుతుంటే.. జగనన్న ‘ఉయ్యాలా-జంపాలా’ పథకంలో భాగమే ఈ రోడ్లని సోషల్ మీడియా వేదికగా రోడ్ల దుస్థితిని షేరు షేస్తూ మీమ్స్, సెటైర్స్ వెల్లువెత్తుతుంటాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరీ దారుణంగా మారిపోయాయి. దీనిమీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా గురువారం కూడా ఓ కార్టూన్ కౌంటర్ ఇచ్చారు. 

బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్ధతుగా పవన్ కల్యాణ్ బహిరంగ సభలో పాల్గొని మరీ గెలిపించాలని కోరారు. అయితే, అదే పవన్ కల్యాణ్ ఆత్మకూరు ఉప ఎన్నికను మాత్రం లైట్ తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థికి మద్ధతుగా ఆత్మకూరు ఉప ఎన్నికలో ఒక్క జనసేన జెండా కూడా ఎగరలేదు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ‘గోదావరి గర్జన’ పేరుతో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు కూడా పవన్ కు ఆహ్వానం అందలేదు. ఈ పరిణామాలు బీజేపీ, జనసేన మధ్య రాజకీయంగా దూరం పెరగిందనే అనుమానాలకు తావిచ్చాయి. తాజాగా.. అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పవన్ కు ఆహ్వానం అందకపోవడం ఈ రెండు పార్టీల మధ్య రాజకీయంగా గ్యాప్ పెరిగిందనే వాదనకు బలం చేకూర్చింది.

Scroll to load tweet…