గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వైయస్ జగన్ అనేక కష్టాలు ఎదుర్కొని ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. 

గుంటూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ మంచి పరిపాలన అందిచాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. మంచి పరిపాలన అందించకుండా కక్ష సాధింపులకు దిగితే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్  జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ లు బీజేపీతో స్నేహం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీతో స్నేహం చేయడం వారికే నష్టమని అభిప్రాయపడ్డారు. 

బీజేపీతో స్నేహం అంటే పాముని మెడలో వేసుకుని తిరగమేనని ఆయన అభివర్ణించారు. బీజేపీతో స్నేహాన్ని విరమించుకుని మంచి పాలనపై దృష్టిసారించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు.