నెల్లూరులోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో భారీ కుంభకోణం జరిగింది. రూ. 32 కోట్ల మేర నిధులు పక్కదారి పట్టినట్టుగా  ఉన్నతాధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది.

నెల్లూరులోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో భారీ కుంభకోణం జరిగింది. రూ. 32 కోట్ల మేర నిధులు పక్కదారి పట్టినట్టుగా ఉన్నతాధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. గోదాముల అద్దెలు, బియ్యం రవాణా చేసే వాహనాలకు చెల్లించాల్సిన అద్దెలు, నిర్వహణ ఖర్చులు.. సంబంధించిన నిధులను కాజేసినట్టుగా ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. సంస్థకు చెందిన నిధులను ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించినట్టుగా తెలుస్తోంది. జౌట్ సోర్సింగ్‌‌‌ ద్వారా పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు కీలకంగా వ్యవహరించినట్టుగా సమాచారం. అకౌంట్ సెక్షన్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కూడా వీరికి సహకరించినట్టుగా తెలుస్తోంది. 

చాలా ఏళ్లుగా తనిఖీలు లేకపోవడం, అధికారులను ప్రలోభాలకు గురిచేయడం.. ద్వారా నిధుల పక్కదారి పట్టిన విషయం బటయకు రాకుండా ఉద్యోగులు జాగ్రత్త పడ్డారు. తాజాగా ఈ నిధుల పక్కదారిపట్టిన ఘటన వెలుగులోకి రావడంతో.. ఉన్నతాధికారులు అధికారులు కూడా సీరియస్‌గా దృష్టి సారించారు. ప్రత్యేక విచారణ అధికారిగా నెల్లూరు జేసీ కూర్మనాథ్‌ను నియమించారు. 

నిధులు పక్కదారి పట్టినట్టుగా గుర్తించిన ఉన్నతాధికారులు.. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందని తెలసుకునే పనిలో పడ్డారు. జౌట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఓ కాంట్రాక్టర్ సహకరించినట్టుగా అధికారులు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టుగా తెలుస్తోంది. అయితే లోతుగా విచారణ జరిపితే.. మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. 

 చెక్ పవర్ ఉన్న జిల్లా మేనేజర్ పద్మ‌కు ఈ కుంభకోణంలో ఏమైనా ప్రమేయం ఉందా? ఆమెకు తెలియకుండా ఎవరైనా నిధులను పక్కదారి పట్టించారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే పద్మను రాష్ట్ర కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ఆమె నిర్వర్తిస్తున్న బాధ్యతలను