Asianet News TeluguAsianet News Telugu

బోటు మునక: తల లేని డెడ్ బాడీ లభ్యం

తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం-కచ్చులూరు మధ్యలో గోదావరి నదిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలు చేస్తోంది.ఆదిావరం నాడు బోటు వెలికితీసే క్రమంలో మొండెం లేని డెడ్‌బాడీ దొరికింది. బోటుకు దుబాసీల సహాయంతో  లంగరు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Godavari Boat capsized: Dharmadi satyam team searching for boat in godvari river
Author
Devipatnam, First Published Oct 20, 2019, 2:08 PM IST

రాజమండ్రి: గత నెల 15వ తేదీన మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటును వెలికితీసే ప్రయత్నాలను ధర్మాడి సత్యం బృందం చేస్తోంది. 

రాయల్ వశిష్ట పున్నమి బోటును వెలికి తీసేందుకు ఆరు రోజులుగా ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలు చేస్తోంది. రెండు రోజుల క్రితం రాయల్ వశిష్ట బోటుకు సంబంధించిన రెయిలింగ్  ధర్మాడి సత్యం బృందానికి లభించింది.

గోదావరి నదిలో 40 అడుగుల లోతులో బోటు ఉన్నట్టుగా ధర్మాడి సత్యం బృందం గుర్తించింది. అయితే దుబాసీలు నదిలోకి వెళ్లి లంగర్ ను బోటుకు తగిలిస్తే సులభంగా నది నుండి బయటకు తీసే అవకాశం ఉంటుందని ధర్మాడి సత్యం బృందం భావిస్తోంది.

బోటు వెలికితీతలో పురోగతి: కచ్చులూరులో లంగర్‌కు చిక్కిన రెయిలింగ్‌

అయితే విశాఖ జిల్లా నుండి ధర్మాడి సత్యం బృందం దుబాసీలను దేవీపట్టణానికి తీసుకొచ్చారు. ఆదివారం నాడు దేవీపట్నం నుండి కచ్చలూరుకు వెళ్లేందుకు ధర్మాడి సత్యం బృందానికి పోలీసులు అనుమతివ్వలేదు.

నదిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు కాకినాడ పోర్టు అధికారుల పర్యవేక్షణలో ధర్మాడి సత్యం బృందం పంటు, లంగర్ సహాయంతో రాయల్ వశిష్ట బోటును వెలికితీసే ప్రయత్నం చేస్తోంది.

ఈ బోటును వెలికితీసేందుకు గత మాసంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి. కానీ, సాధ్యం కాలేదు. అయితే ధర్మాడి సత్యం బృందం ఈ బోటుకు చెందిన రెయిలింగ్ ను బయటకు తీసుకొచ్చాయి. దీంతో ఈ బోటును వెలికితీయవచ్చనే ఆశలు సజీవంగా ఉన్నాయి.

బోటు వెలికితీత: సత్యం లంగర్‌కు తగిలిన ఇనుప వస్తువు, బోటుగా అనుమానం

ఈ బోటును వెలికితీసేందుకు గత నెల చివరివారంలో ధర్మాడి సత్యం బృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 22 లక్షల టెండర్ ను ఇచ్చింది. బోటు వెలికితీతలో పాల్గొనే ధర్మాడి సత్యం బృందానికి రిస్క్ కవరేజీని కూడ ప్రభుత్వం కల్పించింది.

ఆదివారం నాడు  దుబాసీల బృందం విశాఖ నుంచి దేవీపట్నం చేరుకుంది. అయితే దేవీపట్నం నుంచి కచ్చులూరు వెళ్లేందుకు పోలీసులు వారికి అనుమతివ్వలేదు. దీంతో ధర్మాడి సత్యం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కచ్చులూరు వెళ్లేందుకు బోటు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

దుబాసీలు బోటుకు లంగరు తగిలిస్తే బోటును బయటకు తీయడం ఇక సులభం కానుందని ధర్మాడి సత్యం బృందం భావిస్తోంది.  గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటు కోసం గాలింపు చర్యల్లో భాగంగా శనివారం ఓ లైఫ్‌బాయ్‌ దొరికింది. ఇది వాహనాల టైరుకు ఉండే ఓ ట్యూబ్‌ వంటిది. లైఫ్‌ జాకెట్‌ మాదిరిగా ప్రమాద సమయంలో దీన్ని పట్టుకుని ప్రాణాలతో బయటపడవచ్చు. 

బోటు వెలికితీత పనులు షురూ చేసిన ధర్మాడి సత్యం బృందం

ఆదివారం నాడు  మధ్యాహ్నం బోటు కోసం గాలింపు చర్యలు సాగిస్తున్న తరుణంలో  తలలేని మృతదేహం బయటపడింది.అయితే ఈ మృతదేహం ఎవరిదనే విషయమై  అధికారులు ఆరా తీస్తున్నారు. బోటును వెలికితీస్తే ఆచూకీ గల్లంతైన మృతదేహాలు కూ బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
 

"

Follow Us:
Download App:
  • android
  • ios