Asianet News TeluguAsianet News Telugu

అగ్రిమెంట్‌కు భిన్నంగా జీవో, క్యాబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: ఏపీ సీఐడీ ఏడీజీ

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను క్యాబినెట్ అనుమతి లేకుండా ఏర్పాటు చేశారని ఏపీ సీఐడీ తెలిపింది. ఈ కార్పొరేషన్ ఏర్పాటులో విధి విధానాలు పాటించలేదని పేర్కొంది. అగ్రిమెంట్‌కు భిన్నంగా జీవో తెచ్చారని వివరించింది.
 

GO different than MoU, proper rules not followed while establishing skill development corporation says AP CID ADG sanjay kms
Author
First Published Sep 13, 2023, 6:54 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం సంచలనంగా మారింది. కేసు విచారిస్తున్న సీఐడీ కీలక విషయాలు వెల్లడించింది. అగ్రిమెంట్‌కు జీవోకు పొంతన లేదని తెలిపింది. క్యాబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని ఏపీ సీఐడీ ఏడీజీ సంజయ్ తాజాగా విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

క్యాబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ఏపీ సీఐడీ ఏడీజీ సంజయ్ తెలిపారు. అంతేకాదు, కార్పొరేషన్ ఏర్పాటులోనూ విధి విధానాలు పాటించలేదని వివరించారు. ఈ కార్పొరేషన్ నుంచి ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు వెళ్లాయని, ఆ ప్రైవేట్ వ్యక్తుల నుంచి షెల్ కంపెనీలకు మళ్లాయని తెలిపారు.

అప్పటి ఏపీ ప్రభుత్వం జర్మనీ కంపెనీ సీమెన్ కంపెనీతో ఒప్పందం చేసుకుందని సంజయ్ తెలిపారు. అగ్రిమెంట్ రూ. 371 కోట్ల ప్రస్తావన మాత్రమే ఉన్నదని వివరించారు. కానీ, జీవో అందుకు విరుద్ధంగా తీసుకువచ్చారని చెప్పారు. జీవో 90 శాతం, 10 శాతం విధానంలో ఫండింగ్ ఉంటుందని పేర్కొన్నారు. అగ్రిమెంట్‌లో మాత్రం 90 శాతం, 10 శాతం ప్రస్తావనే లేదని వివరించారు. ఈ విషయాన్ని సీమెన్ కంపెనీనే స్వయంగా ధ్రువపరిచిందని తెలిపారు. ఈ జీవో దురుద్దేశాన్ని స్పష్టం చేస్తున్నదని ఆరోపించారు. పూర్తి వివరాలు సీమెన్ కంపెనీకి వెల్లడించలేదని అన్నారు.

Also Read: దోచుకోవడానికే స్కీమ్ .. రూపాయి రాలేదని సీమెన్స్ చెప్పింది, పక్కా ఆధారాలతోనే అరెస్ట్ : సజ్జల

జీవోల్లో 13 చోట్ల సీఎంగా చంద్రబాబు సంతకం ఉన్నదని సంజయ్ వివరించారు. బడ్జెట్ అప్రూవ్ చేయడానికి కౌన్సిల్ సమావే శానికి కూడా చంద్రబాబు సంతకం ఉన్నదని తెలిపారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు గంటా సుబ్బారావు అనే ప్రైవేటు వ్యక్తిని నియమిం చారని, ఆయనకు చాలా పదవులు కట్టబెట్టారని వివరించారు. ఒకే వ్యక్తికి మూడు బాధ్యతలు అప్పగించారని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios