బొబ్బిలి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా బొబ్బిలి సమీప గ్రామంలో నాలుగున్నరేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ నెల 19న ఈ ఘోరం జరిగింది. 

బాధిత చిన్నారి తల్లిదండ్రులను ఆ యువకుడు బెదిరించడంతో వారు విషయాన్ని బయటకు చెప్పలేదు. బాలికను ఆడించడానికి రోజూ అతను ఇంటికి తీసుకువెళ్లేవాడు. ఆ రోజు బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. సంఘటన జరిగిన తరువాత బాలిక ఇంటికి వెళ్లి బోరున ఏడ్చింది. కూతురిని ఓదార్చి తల్లిదండ్రులు జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు.
 
సంఘఘటనపై యువకుడిని ప్రశ్నించేందుకు బాధితురాలి తల్లిదండ్రులు వెళ్లారు. ఈ విషయం బయటకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటానని, దానికి కారణం మీరేనని లేఖ రాసిపెడతానని బెదిరించాడు. కేసుల్లో ఇరుక్కుంటామనే భయంతో వారు వెనక్కి తగ్గారు.. 

అయితే, బాలిక తండ్రి జరిగిన ఘోరాన్ని గ్రామ పెద్దలకు తెలిపి, మంగళవారం బొబ్బిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.