విజయవాడలో ఓ యువతి మిస్సింగ్ మిస్టరీగా మారింది. 22 రోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతి ఆచూకీ ఇప్పటివరకూ లభించలేదు, 

విజయవాడ : కాలేజీకని ఇంట్లోంచి వెళ్ళిన యువతి కనిపించకుండా పోవడం విజయవాడలో కలకలం రేపుతోంది. కుటుంబసభ్యులు, ప్రత్యేక పోలీస్ బృందాలు గత 22 రోజులుగా యువతి కోసం గాలిస్తున్నా ఎక్కడా ఆచూకీ లేదు. దీంతో తమ బిడ్డకు ఏమయ్యిందోనని తల్లిదండ్రులు కంగారుపడుతున్నారు. 

విజయవాడ అజిత్ సింగ్ నగర్ కు చెందిన యువతి ఈ నెల 8న కాలేజీకి వెళుతున్నానని తల్లిదండ్రులకు చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లింది. ఆ రోజు రాత్రివరకు యువతి ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి ఆరా తీసారు. ఎక్కడా కూతురి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు.

మిస్సయిన యువతి కోసం కాలేజీవద్ద గల సిసి కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అలాగే ఆమె స్నేహితుల నుండి వివరాలు సేకరించారు. కాలేజీ నుండి యువతిని సొంత బాబాయ్ నాగరాజు తీసుకెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. కానీ ఆమెను ఎక్కడికి తీసుకెళ్లాడో ఇప్పటివరకు గుర్తించలేకపోయారు. 

యువతిని తీసుకెళ్లిన నాగరాజుపై గతంలోనే అత్యాచారం కేసులున్నాయి. దీంతో అన్నకూతురికి ఎత్తుకెళ్లిన అతడు ఏదయినా అఘాయిత్యానికి పాల్పడ్డాడేమోనని అనుమానం కలుగుతోంది. పోలీసులకు ఎలాంటి క్లూ చిక్కకుండా నాగరాజు జాగ్రత్త పడ్డాడు. 

Read More పోర్న్ వీడియోలు చూపిస్తూ... మనవరాలి వయసు బాలికపై 57ఏళ్ల వృద్దుడు అత్యాచారం

 యువతి మిస్సింగ్ మిస్టరీగా మారింది. ప్రత్యేక పోలీస్ బృందాలు ఎంత గాలిస్తున్నా ఆమె ఆచూకీ మాత్రం లభించడం లేదు. దీంతో యువతి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.