పోర్న్ వీడియోలు చూపిస్తూ... మనవరాలి వయసు బాలికపై 57ఏళ్ల వృద్దుడు అత్యాచారం
అభం శుభం తెలియని మైనర్ బాలికను రెండ్రోజులపాటు ఇంట్లో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వృద్దుడు. ఈ దారుణం విశాఖపట్నంలో చోటుచేసుకుంది.
విశాఖపట్నం : మనవరాలి వయసు చిన్నారిపై ఓ వృద్దుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. బాలికను తన ఇంట్లోనే రెండ్రోజులపాటు బంధించిన వృద్దుడు పోర్న్ వీడియోలు చూపిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండ్రోజుల తర్వాత ఇంటికివెళ్లిన బాలిక వృద్దుడి వికృత చేష్టల గురించి తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిరుపేద బాలికపై జరిగిన అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని రెడ్డి కంచరపాలెంలో ఓ నిరుపేద కుటుంబం నివాసముంటోంది. భర్త వికలాంగుడు కావడంతో కుటుంబ పోషణ భారం భార్యే చూసుకునేది. చిత్తు కాగితాలు, చెత్తలోని వస్తువులను ఎరుకునివచ్చి వాటిని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులతో ఆ ఇల్లాలు కుటుంబాన్ని పోషించుకునేది. ఈ నిరుపేద దంపతుల తొమ్మిదేళ్ల కూతురు సంతానం.
అయితే ఈ పేదకుటుంబం నివాసముండే ప్రాంతానికి సమీపంలో 58 ఏళ్ళ పొలిరెడ్డి ఒంటరిగా వుండేవాడు. ఎలక్ట్రీషన్ పనులు చేసే ఇతడు చుట్టుపక్కల ఇళ్ళ పిల్లలతో చాలా సరదాగా వుండేవాడు. తన ఇంటివద్దే పిల్లలను పోగుచేసి ఆటలు ఆడిస్తుండేవాడు. ఇలా నిరుపేద కుటుంబానికి చెందిన తొమ్మిదేళ్ళ బాలిక కూడా అతడి ఇంటివద్దకు వెళ్లి ఆడుకుంటుండేది. బాలిక తల్లిదండ్రుల నిస్సహాయ పరిస్థితి గురించి తెలిసిన వృద్దుడు నీచంగా వ్యవహరించాడు. బాలికను ఏం చేసినా అడిగేవారు వుండరని భావించినట్లున్నాడు... ఆడుకోడానికి వచ్చిన బాలికను ఇంట్లో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Read More కొండపల్లిలో గుండెలు పిండేసే ఘటన... పసికందును సంచిలో కుక్కి తరలిస్తూ పట్టుబడ్డ వృద్దుడు (వీడియో)
గత గురువారం సాయంత్రం బాలికను ఇంట్లోకి తీసుకెళ్ళి బంధించాడు పొలిరెడ్డి. రెండు రోజులపాటు బాలికను తనవద్దే వుంచుకుని పోర్న వీడియోలు చూపిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం సాయంత్రం బాలికను విడిచిపెట్టగా ఆమె ఇంటికి వెళ్లింది. వృద్దుడి వికృత చేష్టల గురించి బాలిక తల్లికి చెప్పడంతో వెంటనే ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాలికను వైద్యపరీక్షల కోసం తరలించారు.
ఈ కేసును దిశ పోలీస్ స్టేషన్ కు బదిలీచేసి దర్యాప్తు చేపట్టారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వృద్దుడిని అరెస్ట్ చేసి పోక్సో యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన వృద్దుడిని కఠినంగా శిక్షించాలని విశాఖపట్నంవాసులు కోరుతున్నారు.