ఓ మైనర్ బాలికకు బలవంతంగా పెళ్లి చేశారు. అనంతకం ఇంట్లోనే నిర్భందించారు. కన్న తల్లే తన పట్ల అలాప్రవర్తించడంతో బాలిక షాక్ కి గురైంది. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకోని పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా వేటపాలెంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... వేటపాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలిక(15) తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. వారు విడిపోయి పదిహేను సంవత్సరాలు కావస్తోంది. కాగా... బాలిక తండ్రి వద్దే ఉంటూ చదువుకుంటోంది. మూడు నెలల క్రితమే తల్లి వద్దకు వెళ్లింది.

కాగా... నాలుగు రోజుల క్రితం తండ్రి వద్ద విడిచిపెడతానని చెప్పి తల్లి సదరు బాలికను తీసుకొని బయటకు వెళ్లింది. ఇంకొల్లు మండలం పావులూరు ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకువెళ్లి.. పాత చీరాలకు చెందిన వంశీకృష్ణ అనే యువకుడితో బలవంతంగా పెళ్లి చేసింది. అప్పటి నుంచి  బాలికను ఇంట్లో నే ఉంచి తాళం వేశారు.

కాగా... ఆదివారం ఆ బంధీ నుంచి తప్పించుకున్న బాలిక.. వేటపాలెం పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.