విశాఖ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలు హిట్ కాకపోవడం వల్లనే పవన్ కల్యాణ్ పర్యటనలు చేస్తున్నారని ఆమె గురువారం మీడియాతో అన్నారు. 

పవన్‌కల్యాణ్‌కు రాజకీయ పరిపక్వత లేదని అభిప్రాయపడ్డారు. మన్యం అభివృద్ధి చంద్రబాబు పెట్టిన భిక్ష అని అన్నారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు జరగడం లేదని స్పష్టం చేశారు. 

సీఎం చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్ కుమ్మక్కై లాలూచీ రాజకీయం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వైసీపీ రాజీనామా డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. 

ఈ నెల 20న విజయవాడలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర రాజకీయ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దీన్ని సీఎం చంద్రబాబు బీజేపీపైకి నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

వైసీపీ ఎంపీలు రాజీనామాలు నాటకాలని, రాజీ.. డ్రామా చేస్తున్నారని, నిజమైనా రాజీనామాలు కాదని ఆయన అన్నారు.