Asianet News TeluguAsianet News Telugu

పవన్ కల్యాణ్ నేరుగా పాల్గొంటే...: విశాఖ ఉక్కు పోరుపై గంటా శ్రీనివాస రావు

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నేరుగా పాల్గొంటే ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావు అన్నారు.

Ghanta Srinivas Rao urges Pawan Kalyan to participate in Visakha steel agitation
Author
Visakhapatnam, First Published Mar 13, 2021, 12:35 PM IST

విశాఖపట్న: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేరుగా పాల్గొంటే ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావు అన్నారు. తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లో విశాఖ ఉక్కు ప్రైవేటికరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం తరఫున అభ్యర్థిని నిలుపుతామని ఆయన చెప్పారు. 

అఖిలపక్షం నేతలతో చర్చించి తిరుపతిలో అభ్యర్థిని నిలిపే విషయం చర్చిస్తామని గంటా శ్రీనివాస రావు శనివారం మీడియా సమావేశంలో చెప్ాపరు. టీడీపీ, జనసేన, వామపక్షాలు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయని ఆయన చెప్ాపరు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, గుండెచప్పుడుకు విశాఖ ఉక్కు ప్రతీక అని ఆయన అన్నారు. 

నష్టాల సాకుతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శంచారు రాజీనామాలు చేస్తే పోరాటం చేస్తామని మంత్రులు, ఎంపీలు అంటున్నారని, అయితే వారు రాజీనామాలు చేసి విశాఖ ఉక్కు కోసం పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన చెప్పారు. 

కాగా, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళన 30వ రోజుకు చేరుకుంది. రేపు కూర్మన్నపాలెం గేటు నుంచి గాజువాక వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. తమ పోరాటానికి మద్దతు ప్రకటించిన చిరంజీవి, కేటీఆర్ చిత్రాలకు వాళ్లు క్షీరాభిషేకం చేశారు. మిగతావాళ్లు కూడా కేటీఆర్, చిరంజీవి దారిలోకి రావాలని వారు కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios