వైసీపీ అధినేత వైఎస్ జగన్ అవెంజర్స్- ఎండ్ గేమ్ సినిమాకు వెళ్తే రాద్దాంతం చేస్తున్న చంద్రబాబుకు జంట జలకాలాటలు కనిపించడం లేదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు కేబినేట్ లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి అయితే ఉత్తరాంధ్రలో తుఫాన్ వణికిస్తున్నప్పుడు ఆయన విహార్ యాత్రలు చేయడాన్ని ఏమంటారు చంద్రబాబు అంటూ నిలదీస్తున్నారు.   

విశాఖపట్నం: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కానీ ఫలితాలు వెలువడటానికి మాత్రం 45 రోజులు సమయం ఉండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు విహారయాత్రల్లో మునిగితేలుతున్నారు. 

ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు టెన్షన్ భరించలేకో, సర్వేల పేరుతో వచ్చే రచ్చపై చర్చించలేకనో తెలియదు కానీ కుటుంబ సభ్యులతో గడపాలంటూ విహారయాత్రలకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి హిమాచల్ ప్రదేశ్ పర్యటించారు. 

మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం కుటుంబ సభ్యులతో కలిసి స్విట్జర్లాండ్ టూర్ కి వెళ్లొచ్చారు. శుక్రవారం సాయంత్రం లండన్ లోని తనకుమార్తె వద్దకు కుటుంబ సభ్యులతో వెళ్లాల్సి ఉండగా కొన్ని కారణాలతో వాయిదా పడింది. 

ఇకపోతే ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలో సందడి చేస్తున్నారు. విశాఖపట్నంలోని ఓ విలాసవంతమైన హోటల్ లోని స్విమ్మింగ్ పూల్ లో సేదతీరారు. మనవడితో ఆడుకుంటూ ఆ ఫొటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపాక నా కుటుంబ సభ్యులతో కలిసి విహారయత్రాకు వచ్చాను మనవడితో నీలి రంగు నీటిలో ఆడుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. అయితే మంత్రి గంటా శ్రీనివాసరావు జలకాలాటలు ఆడుతున్న ఫోటోలు షోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

వైసీపీ అధినేత వైఎస్ జగన్ అవెంజర్స్- ఎండ్ గేమ్ సినిమాకు వెళ్తే రాద్దాంతం చేస్తున్న చంద్రబాబుకు జంట జలకాలాటలు కనిపించడం లేదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు కేబినేట్ లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి అయితే ఉత్తరాంధ్రలో తుఫాన్ వణికిస్తున్నప్పుడు ఆయన విహార్ యాత్రలు చేయడాన్ని ఏమంటారు చంద్రబాబు అంటూ నిలదీస్తున్నారు.

Scroll to load tweet…