తప్పిన ప్రమాదం: విశాఖ హెచ్‌పీసీఎల్ లో గ్యాస్ లీక్
విశాఖపట్టణం హెచ్‌పీసీఎల్ లో గ్యాస్ లీకైంది. గ్యాస్ లీకేజీని అరికట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కంపెనీలో యధావిదిగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కంపెనీ ప్రకటించింది.
విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) లో బుధవారం నాడు స్వల్పంగా గ్యాస్ లీకైంది.గ్యాస్ లీకైన వెంటనే సైరన్ మోగింది. దీంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. గ్యాస్ లీకైన విషయాన్ని గుర్తించిన అధికారులు గ్యాస్ లీకేజీని అధికారులు అదుపు చేశారు. అప్రమత్తమైన అధికారులు హెచ్‌పీసీఎల్ లో యధావిధిగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని యాజమాన్యం ప్రకటించింది.
గతంలో కూడ విశాఖపట్టణం గ్యాస్ లీకైన ఘటనలు చోటు చేసుకొన్నాయి. గతంలో విశాఖలో చోటు చేసుకొన్న ప్రమాదాల తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నారు.2020 మే 7న ఎల్జీ పాలీమర్స్ సంస్థలో స్టైరిన్ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు.
వెంకటాపురం పరిసర ప్రాంతాల ప్రజలు విష వాయువు ప్రభావంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. విషవాయువు లీకై 12 మంది ప్రమాదం జరిగిన రోజున చనిపోగా.. మరొక ముగ్గురు కొద్దిరోజుల తర్వాత కన్నుమూశారు. స్టైరిన్ పీల్చిన కారణంగా గ్రామస్థులకు అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అప్పటి నుంచి గ్యాస్ లీకేజీ అంటేనే విశాఖ వాసులు హడలిపోతున్నారు.