అమరావతి: నాకు విప్ ఇచ్చే మగాడా... అని చంద్రబాబుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం నాడు సాయంత్రం రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. విప్ అందిందా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ఆయన తీవ్రంగా స్పందించారు.

విప్ ఇవ్వడానికి చంద్రబాబు దగ్గర ఏముంది, ఉడకబెట్టిన నాగడి దుంప.. అంటూ ప్రశ్నించారు.  అంత పెద్ద మగాడా అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో తనను ప్రత్యేక సభ్యుడిగా స్పీకర్ గుర్తించినట్టుగా వంశీ చెప్పారు.

సస్పెండ్ చేసిన తనకు విప్ జారీ చేసి... పార్టీకి ఓటేయాలని కోరడాన్ని ఆయన తప్పుబట్టారు. నాకన్నా సిగ్గుండాలి... ఆయనకన్నా ఉండాలి కదా అన్నారు.నాకైతే సిగ్గుందని వంశీ స్పష్టం చేశారు.విప్ ఇవ్వడం గాడిద గుడ్డు ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 

చంద్రబాబు నాయుడు తన పక్కన ఉన్న చెంచాల మాటలను విని పార్టీని నాశనం చేశారన్నారు.  ఇదే విషయాన్ని తాము చంద్రబాబుకు చెప్పినట్టుగా ఆయన గుర్తు చేశారు.  ఏడాది కాలంగా ఏపీ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్నిఛానెల్స్ కు డబ్బులు ఇచ్చి వార్తలు రాయించడం ద్వారా చంద్రబాబుకు ప్రాణం పోస్తున్నారని ఆయన ఆరోపించారు.

also read:ఏపీలో ముగిసిన రాజ్యసభ పోలింగ్: ఓటేసిన ఆ ముగ్గురు టీడీపీ రెబెల్స్

గెలిచే బలం ఉన్న సమయంలో వ్యాపారవేత్తలకు రాజ్యసభ టిక్కెట్లను త్రాసులో పెట్టి తూకం వేశాడన్నారు. సంఖ్యా బలం లేని సమయంలో మాత్రం దళితుడిని రాజ్యసభకు బరిలో దింపారన్నారు.

ఓడిపోయే సమయంలో దళితులకు చంద్రబాబునాయుడు రాజ్యసభ టిక్కెట్టు ఇచ్చారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి విమర్శించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని చెప్పారు. ఐదుగురు దళితులను మంత్రులను చేసిన ఘనత జగన్ దేనని ఆయన ప్రశంసించారు.