టీడీపీకి వల్లభనేని వంశీ రాజీనామా: రాజకీయాలకు గుడ్‌బై

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి కూడ వంశీ రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. రాజకీయాల నుండి తప్పుకొంటున్నట్టుగా వల్లభనేని వంశీ ప్రకటించారు. 

Gannavaram MLA vallabhaneni Vamshi Resigns To TDP

టీడీపీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదివారం నాడు రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు  ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామ చేశారు. ఈ రెండు పదవులతొ పాటు రాజకీయాల నుండి కూడ తప్పుకొంటున్నట్టుగా వల్లభనేని వంశీ ప్రకటించారు.

వల్లభనేని వంశీ రాజకీయాలకు కూడ దూరంగా ఉంటానని ప్రకటించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వల్లభనేని వంశీ వ్యూహాత్మకంగానే  ఈ నిర్ణయం తీసుకొన్నారనే  టీడీపీ నాయకత్వం భావిస్తొంది.

స్థానికంగా వైసీపీ నేతల కారణంగా తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం రాజీనామా చేసినట్టుగా  వల్లభనేని వంశీ నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది. రాజకీయంగా ప్రత్యర్థుల బెదిరింపులకు వంశీ భయపడే మనస్తత్వం ఉన్నవాడు కాదని ఆయన గురించి తెలిసినవారు చెబుతున్నారు. 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత కూడ ఆయన రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు.

జగన్ సీఎం అయిన తర్వాత నకిలీ ఇళ్లపట్టాల  కేసు నమోదు కావడంతో వంశీ ఈ రాజీనామా చేసినట్టుగా చెబుతున్నారు. స్థానిక వైసీపీ నేతలు రెవిన్యూ అధికారులను ఎలా ఈ రకంగా తనపై కేసు పెట్టించారో ఈ నెల 24వ తేదీన వంశీ ప్రకటించారు.

కానీ, ఈ కేసు కారణంగానే వంశీ రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించడం పట్ల టీడీపీ నేతలు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు ఉంటానని వల్లభనేని వంశీ చేసిన ప్రకటన ఆయన ప్లాన్ ‌లో భాగమేననే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.Gannavaram MLA vallabhaneni Vamshi Resigns To TDP

Also Read:చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ఎసరు: జగన్ కి టచ్ లో 10మంది టీడీపీ ఎమ్మెల్యేలు


వల్లభనేని వంశీ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని జగన్ వంశీకి షరతు పెట్టినట్లు తెలుస్తోంది. ఆయనకు జగన్ రాజ్యసభ సీటును ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

Also Read:వల్లభనేని వంశీపై చంద్రబాబు ఆగ్రహం: తడాఖా చూపాలని దేవినేని ఉమకు ఆదేశం

వంశీ జగన్ ను కలుస్తున్నట్లు వార్తలు వచ్చిన మరుక్షణం యార్లగడ్డ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శనివారంనాడు యార్లగడ్డ నివాసానికి ఆయన అనుచరులు చేరుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వంశీని పార్టీలో చేర్చుకోవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు.

Also Read:చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ఎసరు: జగన్ కి టచ్ లో 10మంది టీడీపీ ఎమ్మెల్యేలు

వల్లభనేని వంశీ వైసీపీలో చేరుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు వల్లభనేని వంశీ రాజీనామా చేస్తున్నట్టుగా ఆదివారం నాడు ప్రకటించారు. 

Also Read:ఇద్దరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్: జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ వెనుక నాని

ఆదివారం  నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబుకు వల్లభనేని  వంశీ టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు లేఖ రాశారు. ఎమ్మెల్యే పదవితో పాటు, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడ రాజీనామా చేశారు. నవంబర్ మాసంలో వల్లభనేని వంశీ వైసీపీలో చేరుతానని ప్రచారం సాగింది.కానీ, చంద్రబాబునాయుడుకు రాసిన లేఖలో రాజకీయాల నుండి తప్పుకొంటున్నట్టుగా వంశీ ప్రకటించారు.

నియోజకవర్గంలో వైసీపీ నేతలు, అధికాారులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో పరోక్షంగా వల్లభనేని వంశీ పరోక్షంగా వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుపై విమర్శలు చేశారు. 

రాజకీయాలకు దూరంగా ఉంటానని వల్లభనేని వంశీ ప్రకటించడం ప్రస్తుతం చర్చకు దారితీసింది. గన్నవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు వల్లభనేని వంశీని టీడీపీని వీడీ వైసీపీలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నారు. 

వంశీ తీసుకొన్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెరలేపింది. శుక్రవారం నాడు వల్లభనేనిి వంశీ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. జగన్ ను కలిసిన సమయంలో ఏం చర్చించారనే విషయమై ప్రస్తుతం చర్చకు తెరలేపింది. 

వంశీని వైఎస్సార్ కాంగ్రెసులో చేర్చుకుంటే తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం ఏర్పడుతుందని  ఆందోళన చెందుతున్న యార్లగడ్డ  మంత్రులు కొడాలి నాని, పేర్ని నానీలతో కలిసి వంశీ జగన్ నివాసానికి చేరుకున్నారు. జగన్ తో వంశీ అరగంట పాటు సమావేశమయ్యారు. 

వంశీ జగన్ ను కలవడానికి ముందు బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని కూడా కలిశారు. అయితే, సుజనా చౌదరిని ఆయన మర్యాదపూర్వకంగానే కలిసినట్లు వార్తలు వచ్చాయి. చివరికి వంశీ వైసిపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వంశీపై ఇటీవల కేసు నమోదైంది. నకిలీ పట్టాలు ఇచ్చారనే ఆరోపణపై ఆ కేసు నమోదైంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios