టిడిపి గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ ప్రభుత్వంపై తీవ్ర నిరసన తెలిపారు. గన మెన్ల వివాదంలో వంశీ తన నిరసన తెలపటం గమనార్హం. తనకు 2 +2 గన్ మెన్లు కావాలని వంశీ ఎప్పటి నుండో అడుగుతున్నారు. ప్రస్తుతం ఒన్ ప్లస్ ఒన్ గన్ మెన్లున్నారు.  

టిడిపి గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ ప్రభుత్వంపై తీవ్ర నిరసన తెలిపారు. గన మెన్ల వివాదంలో వంశీ తన నిరసన తెలపటం గమనార్హం. తనకు 2 +2 గన్ మెన్లు కావాలని వంశీ ఎప్పటి నుండో అడుగుతున్నారు. ప్రస్తుతం ఒన్ ప్లస్ ఒన్ గన్ మెన్లున్నారు. తనకు భద్రత పెంచాలంటూ మూడున్నర సంవత్సరాలుగా అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదట. తన గన్ మెన్ కు ఓ పిస్టల్ మాత్రమే ఇచ్చారట. కనీసం కార్బన్ వెపన్ కూడా ఇవ్వలేదని ఎంఎల్ఏకి కోపం. మూడున్నరేళ్ళ నుండి అడుగుతున్నా తనకు భద్రత పెంచకపోవటంపై ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అదేవిధంగా తన లైసెన్సుడు ఆయుదాలు మూడింటిని రెన్యువల్ కోసం పోలీసు స్టేషన్లో అప్పగించారట. కనీసం వాటిని తిరిగికూడా ఇవ్వలేదట ఎంఎల్ఏకి. దాంతో మండిపోయిన ఎంఎల్ఏ తన గన్ మెన్ ను ప్రభుత్వానికి సరెండర్ చేసి నిరసన తెలిపారు.