విశాఖ జిల్లా ఏజెన్సీలో (visakha agency) గంజాయి ముఠాపై (ganja gang) కాల్పులు (gun firing) జరిపారు పోలీసులు. గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకోవడానికి నల్లగొండ (nalgonda) నుంచి విశాఖ వెళ్లింది ఓ పోలీస్ బృందం .
విశాఖ జిల్లా ఏజెన్సీలో (visakha agency) గంజాయి ముఠాపై (ganja gang) కాల్పులు (gun firing) జరిపారు పోలీసులు. గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకోవడానికి నల్లగొండ (nalgonda) నుంచి విశాఖ వెళ్లింది ఓ పోలీస్ బృందం . అయితే పోలీసులను చూసిన గంజాయి ముఠా సభ్యులు.. ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు దుండగులు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు .. స్మగ్లర్లపై పది రౌండ్ల కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. దీంతో స్మగ్లర్లు ఘటనాస్థలం నుంచి పారిపోయారు. కాల్పులకు సంబంధించిన విషయాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ (nalgonda district sp)ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

