శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్  కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో మంగళవారం ఉదయం ప్రమాదానికి గురయ్యింది. కాన్వాయిలోని ఓ వాహనం ఆళ్లగడ్డ సమీపంలో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. కడప విమానాశ్రయానికి వెళ్తుండగా.. గంగుల ప్రబాకర్ రెడ్డి కి బందోబస్తుగా వెళ్తున్న సమయంలో ఈ ఫ్రమాదం చోటుచేసుకుంది.

వాహనం టైర్ పగలడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులు చంద్రయ్య, గంగాధరప్ప, బాలరాజులు గాయపడ్డారు. వీరిలో చంద్రయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ప్రభాకర్ రెడ్డి కుమారుడు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్రారెడ్డి సహాయక చర్యలు చేపట్టి వారిని మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించారు. చంద్రయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.