మంత్రాలయంలో ఓ యువతి మీద ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత హత్య చేసి, శవాన్ని చెట్టుకు వేలాడదీశారు.
మంత్రాలయం : కర్నూలు జిల్లా మంత్రాలయంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువతి మీద ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. దారుణంగా హత్య చేశారు. ఆ యువతిని కిడ్నాప చేసి, అత్యాచారం చేసిన అనంతరం హత్య చేశారని అనుమానిస్తున్నారు. తరువాత శవాన్ని చెట్టుకు వేలాడదీశాడు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.
దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు ఆమెను హత్య చేసిన తరువాతే చెట్టుకు ఉరివేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలిని బుడగజంగాల సామాజిన వర్గానికి చెందిన యువతిగా గుర్తించారు. నిందితుల్లో ఇధ్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు.
కర్ణాటక గిలగనూరు క్యాంపులో యువతిపై అత్యాచారం చేశారు. గ్రామాల్లో తిరుగుతూ వస్తువులు అమ్ముకునే బాలిక మీద కన్నేసిన ముగ్గురు యువకులు. సమీప పొలాల్లోని తీసుకెళ్లి ముగ్గురు యువకులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తరువాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
