తూర్పు గోదావరి జిల్లా యానాం కో ఆపరేటివ్ శాఖలో పనిచేసే ఉద్యోగి రమేష్ ఆత్మహత్య చేసుకొన్నాడు.తన ఆత్మహత్యకు సివిల్ సప్లై శాఖ అధికారి ప్రసాద్ తో పాటు పలువురు కారణమని పేర్కొన్నారు. 

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా యానాంలో విషాదం నెలకొంది. Yanam కో ఆపరేటివ్ సోసైటీలో పనిచేసే ఉద్యోగి గణేష్ బుధవారం నాడు రాత్రి ఆత్మహత్య చేసుకొన్నాడు. suicideకు ముందు Ganesh తన మరణానికి పలువురు కారణమంటూ పేర్కొన్నారు. ఈ selfie వీడియో ఆధారంగా కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ ముందు మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా యానాంలోని కోఆపరేటివ్ సోసైటీలో పనిచేసే ఉద్యోగి గణేష్ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకొన్నాడు. తన ఆత్మహత్యకు సివిల్ సప్లై అధికారి ప్రసాద్ తో పాటు శ్రీను, రాంబాబు, సూరిబాబు, రెడ్డి సుబ్రమణ్యంలదే బాధ్యత అంటూ ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. గణేష్ సెల్ఫీ వీడియో ఆధారంగా case నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.