ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అధికార టీడీపీకి దెబ్బమీద దెబ్బ తగులుతుంది. ఇప్పటి వరకు పార్టీ నేతలు టీడీపీకి రాజీనామా చేసి..వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు వైసీపీ అయిపోయింది.. జనసేన మీద పడ్డారు. జనసేనలోకి టీడీపీ నేతల చేరికలు షురూ అయ్యాయి.

టీడీపీ మైనార్టీ నేత అల్తాప్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. శనివారం మధ్యాహ్నం జనసేన నేత తోట చంద్రశేఖర్ సమక్షంలో అల్తాప్ కండువా కప్పుకున్నారు. కాగా.. ఈయన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు ప్రధాన అనుచరుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గల్లా జయదేవ్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. జనసేనలో తనకు ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా పనిచేసి జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తానన్నారు.