గజపతినగరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live
1955లో ఏర్పడిన గజపతినగరం నియోజకవర్గంలో గజపతినగరం , బొండపల్లి, గంట్యాడ, దత్తిరాజేరు, జామి మండలాలున్నాయి. రాజకీయ ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతంలో కాపు , క్షత్రియ, కొప్పల వెలమ సామాజిక వర్గాలదే ఆధిపత్యం. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, టీడీపీ 5 సార్లు, స్వతంత్రులు రెండు సార్లు, ప్రజా సోషలిస్ట్ పార్టీ , స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ, వైసీపీలు ఒక్కొక్కసారి విజయం సాధించాయి. గజపతుల కోటలో మరోసారి జెండా ఎగురవేయాలని సీఎం వైఎస్ జగన్ పావులు కదిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్యకు మరోసారి అవకాశం కల్పించారు. టీడీపీ అభ్యర్ధిగా కొండపల్లి శ్రీనివాస్‌కు టికెట్ కేటాయించారు చంద్రబాబు.
గజపతి నగరం .. విజయనగరం జిల్లాలోని కీలకమైన స్థానం. రాజుల ఏలుబడిలో వెలిగిపోయిన ప్రాంతం. రాజకీయ ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతంలో కాపు , క్షత్రియ, కొప్పల వెలమ సామాజిక వర్గాలదే ఆధిపత్యం. విజయనగరాన్ని పాలించిన పూసపాటి రాజవంశీయుల ప్రభావం ఇక్కడ అధికం. 1955లో ఏర్పడిన గజపతినగరం నియోజకవర్గంలో గజపతినగరం , బొండపల్లి, గంట్యాడ, దత్తిరాజేరు, జామి మండలాలున్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,04,181 మంది. వీరిలో పురుషులు 1,02,524 మంది.. మహిళలు 1,01,648 మంది. వరి, పత్తి, మామిడి ప్రధాన పంటలు. తాటిపూడి, చిట్టాయి ప్రాజెక్ట్‌ల కారణంగా ఈ నియోజకవర్గంలో తాగు, సాగునీరు అందుతోంది.
గజపతినగరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. పూసపాటి వంశీయుల ప్రభావం :
1955లో నియోజకవర్గం ఏర్పడినప్పుడు .. విజయనగరం సంస్థానాధీశుడు పీవీజీ రాజు భార్య కుసుమ్ గజపతి రాజు (అశోక్ గజపతిరాజు తల్లి) ప్రజా సోషలిస్ట్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. తద్వారా గజపతి నగరానికి తొలి ఎమ్మెల్యేగా కుసుమ్ చరిత్రలో నిలిచిపోయారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, టీడీపీ 5 సార్లు, స్వతంత్రులు రెండు సార్లు, ప్రజా సోషలిస్ట్ పార్టీ , స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ, వైసీపీలు ఒక్కొక్కసారి విజయం సాధించాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి బొత్స అప్పల నరసయ్యకు 93,270 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి కొండపల్లి అప్పలనాయుడుకు 66,259 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 27,011 ఓట్ల మెజారిటీతో తొలిసారిగా గజపతినగరంలో జెండా పాతింది.
గజపతినగరం శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. పట్టు నిలుపుకోవాలని వైసీపీ :
2024 ఎన్నికల విషయానికి వస్తే.. గజపతుల కోటలో మరోసారి జెండా ఎగురవేయాలని సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్యకు మరోసారి అవకాశం కల్పించారు. జగన్ సంక్షేమ పాలన, అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని నరసయ్య ధీమాగా వున్నారు. టీడీపీ విషయానికి వస్తే.. తన ఒకప్పటి కంచుకోటలో తిరిగి పసుపు జెండా ఎగురవేయాలని చంద్రబాబు కృతనిశ్చయంతో వున్నారు. టీడీపీ అభ్యర్ధిగా కొండపల్లి శ్రీనివాస్‌కు టికెట్ కేటాయించారు. జగన్ పాలనపై వ్యతిరేకత, టీడీపీ జనసేన బీజేపీ కూటమి తనను గెలిపిస్తుందని భావిస్తూ ముందుకు సాగారు.
గజపతినగరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
గజపతినగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. వైఎస్సార్‌సీపీ చెందిన బొత్స అప్పలనర్సయ్యపై తెలుగుదేశం పార్టీకి చెందిన కొండపల్లి శ్రీనివాస్ 25301 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
- Gajapathinagaram Assembly constituency
- Gajapathinagaram Assembly elections result 2024
- Gajapathinagaram Assembly elections result 2024 live updates
- andhra pradesh assembly elections 2024
- ap assembly elections 2024
- bharatiya janata party
- bjp
- chandrababu naidu
- congress
- janasena
- pawan kalyan
- tdp
- tdp janasena alliance
- telugu desam party
- ycp
- ys jagan
- ys jagan mohan reddy
- ys sharmila
- ysr congress party
- ysrcp