175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే టార్గెట్: గడప గడపకు ప్రభుత్వంపై వర్క్‌షాప్‌లో జగన్ దిశా నిర్ధేశం
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్ షాప్ ఇవాళ తాడేపల్లిలో ప్రారంభమైంది. సీఎం జగన్ పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశా నిర్ధేశం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు లక్ష్యంగా పనిచేయాలని టార్గెట్ గా పని చేస్తున్నారు.
అమరావతి: :Gadapa Gadapa ku Prabhutvam కార్యక్రమంపై Work shop బుధవారం నాడు ప్రారంభమైంది. ఈ వర్క్ షాప్ లో ఏపీ సీఎం YS Jagan పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు..ఈ ఏడాది మే 11వ తేదీన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని YCP చేపట్టింది.
ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హమీల్లో 95 శాతం అమలు చేసినట్టుగా వైసీపీ ప్రకటించింది.ఈ హామీల అమలు క్షేత్రస్థాయిలో ఎలా ఉందనే విషయమై ప్రజా ప్రతినిధులు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో తెలుసుకొంటారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రజల నుండి వచ్చి స్పందనను సీఎం దృష్టికి తీసుకు రానున్నారు.
బుధవారం నాడు Tadepalli లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గడప గడపకు ప్రభుత్వం వర్క్ షాప్ సీఎం జగన్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ వర్క్ షాప్ లో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిపై సీఎం జగన్ ప్రజా ప్రతినిధులకు వివరించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఏ రకంగా ఈ కార్యక్రమం జరిగిందనే విషయమై చెబుతారు.. ఏ ప్రజా ప్రతినిధి పనితీరు ఎలా ఉంది, ఏ విషయంలో మెరుగు పడాలనే విషయాలపై కూడా సీఎం జగన్ దిశా నిర్ధేశం చేయనున్నారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు జగన్ టార్టెట్ ఫిక్స్ చేశారు. ఈ దిశగా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతుందా లేదా అనే విషయమై జగన్ పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేస్తారు.
175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు కష్టం కాదు: జగన్
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం 8 మాసాలు జరుగుతుందని చెప్పారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి తీరాలని జగన్ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు.ఈ దిశగా కష్టపడాలని సూచించారు. 175 అసెంబ్లీ స్థానాలు సాధించడమే మన లక్ష్యమన్నారు. ఇది కష్టం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.కుప్పం మున్సిపాలిటీని గెలుస్తామని అనుకున్నామా, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్లీన్ స్వీప్ చేస్తామనుకున్నామా అని జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కష్టపడితే రానున్న ఎన్నికల్లో 175 సీట్లు సాధించవచ్చన్నారు.నెలలో 20 రోజుల చొప్పున 10 సచివాలయాల్లో గడప గపడకు కార్యక్రమం నిర్వహించాలని సీఎం సూచించారు.