Asianet News TeluguAsianet News Telugu

APSRTC: ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంపై క్లారిటీ

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంపై ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టత ఇచ్చారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.
 

free bus travel service for women in andhra pradesh, apsrtc md clarifies reports kms
Author
First Published Jan 11, 2024, 3:09 AM IST

APSRTC: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కింద విజయవంతంగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నది. మహిళా లోకం నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. ఇదే తరుణంలో ఏపీలోనూ ఉచిత రవాణ సదుపాయాన్ని కల్పిస్తామని టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చింది. ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీ కూడా సంక్రాంతి తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించబోతున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. అయితే, అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ తరుణంలోనే ఏపీఎస్ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. అయితే, సంక్రాంతి పండుగ కోసం స్పెషల్ బస్సులు నడుపుతున్నట్టు వివరించారు. రాను పోను టికెట్ బుక్ చేసుకుంటే చార్జీలపై పది శాతం రాయితీ లభిస్తుందని వెల్లడించారు. రానున్న నాలుగు నెలల్లో కొత్తగా 1,500 బస్సులు వస్తాయని వివరించారు.

Also Read: నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలకలం.. 11.14 క్వింటాళ్లు స్వాధీనం.. అందులో ఏం కలిపారంటే?

అంతేకాదు, సంక్రాంతి పండుగ సందర్భంగా డోర్ పిక్ అండ్ డోర్ డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించనున్నట్టు ఎ:డీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios