అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్ దేశపు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై రెండురోజులపాటు ఏపీలో పర్యటించేందుకు వచ్చింది ఫ్రెండ్ పారిశ్రామిక వేత్తల బృందం. 

రెండురోజుల పర్యటనలో భాగంగా ఫ్రెంచ్ పారిశ్రామిక వేత్తల బృందం ఏపీ సీఎం వైయస్ జగన్ తో భేటీ అయ్యింది. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై సీఎం జగన్ తోపాటు మంత్రులతో చర్చించారు. పెట్టుబడుల అనుకూలతను పారిశ్రామిక వేత్తల బృందానికి మంత్రులు వివరించారు. 

డెయిరీ, ఆటోమెుబైల్, ఎలక్ట్రిక్ గ్రిడ్, ఆటోమేషన్, ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రులు సూచించారు. అందుకు ఫ్రెంచ్ పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.