అనంతపురం జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై 40ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఆ కిరాతకుడు దారుణానికి ఒడిగట్టగా... ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  అనంతపురం జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ కాలనీలో నివాసముంటున్న నాలుగేళ్ల చిన్నారిపై బుధవారం రాత్రి ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో అదే ప్రాంతానికి చెందిన కిరణ్(40) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అతను  చేస్తున్న పని అర్థంకాని చిన్నారి.. గట్టిగా అరవడాన్ని స్థానికులు గమనించారు. కాగా అప్పటికే నిందితుడు పరారయ్యాడు. కాగా ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు సముదాయించే ప్రయత్నం చేశారు.

అనంతరం ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు ఇంటికి చేరుకునేసరికి బాలిక రహస్య ప్రదేశాల నుంచి రక్తం కారడాన్ని గమనించారు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.