నెల్లూరు జిల్లాలో నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెండ్ అయిన వారిలో మర్రిపాడు ఎస్సై, ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌ ఉన్నారు. 

నెల్లూరు జిల్లాలో నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెండ్ అయిన వారిలో మర్రిపాడు ఎస్సై, ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌ ఉన్నారు. ఓ దివ్యాంగుడు ఆత్మహత్య కేసులో ఈ నలుగురు పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే మర్రిపాడు ఎస్సై వెంకటరమణ, ఏఎస్సై జయరాజ్, కానిస్టేబుల్స్‌ చాంద్ బాషా, సంతోష్ కుమార్‌లను సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. 

ఇక, ఇటీవల జిల్లాలోని అనంతసాగరం మండలానికి చెందిన ఓ దివ్యాంగుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇందుకు పోలీసుల వేధింపులే కారణమని అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. చోరీ కేసులో తమ కుమారుడిని మర్రిపాడు ఎస్‌ఐ వెంకటరమణ కొట్టాడని.. గురువారం పోలీసు స్టేషన్‌కి రావాలని పిలిచారని చెప్పారు. అయితే పోలీసు స్టేషన్‌లో మళ్లీ కొడతారేమోనన్న భయంతో తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు.