కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొన్న నర్సింగ్ విద్యార్ధులకు అస్వస్థత: రుయాకు తరలింపు
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొన్న నర్సింగ్ విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన నలుగురు విద్యార్ధులను రుయా ఆసుపత్రికి తరలించారు.
తిరుపతి: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొన్న నర్సింగ్ విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన నలుగురు విద్యార్ధులను రుయా ఆసుపత్రికి తరలించారు.
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొన్న హెల్త్ వర్కర్లు కొందరు అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత అస్వస్థతకు గురౌతున్నారు. అయితే అస్వస్థతకు గురి కావడంవెనుక కరోనా వ్యాక్సిన్ కారణమనే విషయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు.
తిరుపతిలో కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాతే అస్వస్థతకు గురైనట్టుగా సహచర విద్యార్ధులు చెబుతున్నారు. అస్వస్థతకు గురైన వారిని రుయాకు తరలించి చికిత్స అందిస్తున్నారు.నర్సింగ్ విద్యార్ధుల అస్వస్థతకు కరోనా వ్యాక్సిన్ కారణమా కాదా అనే విషయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఈ విషయమై అధికారులు పరీక్షలు చేయనున్నారు.
ఏపీ రాష్ట్రంలో హెల్త్ వర్కర్ కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత మరణించారు. ఆమె మృతికి కరోనా వ్యాక్సిన్ కారణం కాదని జీజీహెచ్ సూపరింటెండ్ ప్రకటించారు. ఆశావర్కర్ కు ఛాతీ నొప్పి కారణంగానే మరణించిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన గత మాసంలో చోటు చేసుకొంది. తాజాగా తిరుపతిలో ఈ తరహ ఘటన చోటు చేసుకొంది.