కోవిడ్ సెకండ్ వేవ్ భారతదేశంలో అంతులేని విషాదాలను మిగులుస్తోంది. గడిచిన కొద్దిరోజులుగా రోజువారీ మరణాలు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ఎన్నో కుటుంబాలు ఆత్మీయులను దూరం చేసుకున్నాయి

కోవిడ్ సెకండ్ వేవ్ భారతదేశంలో అంతులేని విషాదాలను మిగులుస్తోంది. గడిచిన కొద్దిరోజులుగా రోజువారీ మరణాలు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ఎన్నో కుటుంబాలు ఆత్మీయులను దూరం చేసుకున్నాయి. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలో రోజుల వ్యవధిలో నలుగురు కోవిడ్‌తో మృత్యువాతపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలంలోని నెల్లిముక్కు ఉక్కు నిర్వాసిత కాలనీకి చెందిన బెల్లాల రమణమ్మ (89)కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఏప్రిల్‌ 8న రమణమ్మ రెండో కోడలు వరలక్ష్మి (54) కొవిడ్‌తో కన్నుమూశారు. 26న రమణమ్మ మృతిచెందారు.

Also Read:తగ్గినట్లే తగ్గి మళ్లీ పంజా: ఏపీలో కొత్తగా 20,065 కరోనా కేసులు.. 3 జిల్లాల్లో ఆందోళనకరం

ఇదే సమయంలో స్టీల్‌ ప్లాంటులో సీనియర్‌ ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్న మూడో కుమారుడు శ్రీరామయ్య గుప్తా (52) ఏప్రిల్‌ 29న, ఉక్కు కోకొవెన్‌ విభాగంలో పనిచేసే పెద్ద కుమారుడు శ్రీరామలింగేశ్వరరావు (59) శనివారం చనిపోయారు.

రమణమ్మ పెద్ద కుమార్తె జానకి (65) గతేడాది ఆగస్టులో కొవిడ్‌తోనే మృతి చెందారు. ఇలా రోజుల వ్యవధిలో కుటుంబానికి పెద్ద దిక్కులాంటి వారు మరణించడంతో వారి పిల్లలు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు.