నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నంద్యాలలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కూతుళ్లతో పాటు తల్లిదండ్రులు  బలవన్మరణానికి పాల్పడ్డారు. 

నంద్యాలలోని మాల్దారుపేటలో ఆ సంఘటన చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక వారు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మృతి చెందినవారిని శేఖర్ (35), కళావతి (300, అంజలి (16), అఖిల (14)లుగా పోలీసులు గుర్తించారు. పురుగుల మందు తాగి నలుగురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. 

వివరాలు అందాల్సి ఉంది.