చిత్తూరు: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం పాలమాకుల వద్ద ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

పాలమాకుల వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణీస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.  మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.కర్ణాటక నుండి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. మృతులను గుర్తించాల్సి ఉంది.

ఎదురుగా వచ్చిన బైక్ ను ఢీకొన్న కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. అంతేకాదు వేగం అదుపుకాకపోవడంతో లారీ కిందకు దూసుకెళ్లింది కారు.ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు వ్యక్తులతో పాటు బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. 

అతి వేగం వల్లే  ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు. వేగంగా వస్తున్న కారు బైక్ ను తప్పించలేకపోయింది. బైక్ ను ఢీకొని లారీ కిందకు దూసుకెళ్లింది. లారీ కిందకు వెళ్లడంతోనే కారు వేగం తట్టుకొందని పోలీసులు చెప్పారు.