Asianet News TeluguAsianet News Telugu

ఏపీ అసెంబ్లీ సమావేశాలు : దిశా బిల్లుతో సహా నాలుగు కీలక బిల్లుల ఆమోదం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజున ప్రభుత్వం కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టింది.  మొదట దిశా బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.  కాగా, ఈ బిల్లుపై చర్చించాలని, మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని టీడీపీ పట్టుబట్టింది. అయితే, అవకాశం ఇవ్వకపోవడంతో టీడీపీ వాకౌట్ చేసింది.  

Four Key Bills Approved in AP Assembly in Fourth Day - bsb
Author
hyderabad, First Published Dec 3, 2020, 12:04 PM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజున ప్రభుత్వం కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టింది.  మొదట దిశా బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.  కాగా, ఈ బిల్లుపై చర్చించాలని, మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని టీడీపీ పట్టుబట్టింది. అయితే, అవకాశం ఇవ్వకపోవడంతో టీడీపీ వాకౌట్ చేసింది.  

దిశా బిల్లు తరువాత ప్రభుత్వం ఏపీ ల్యాండ్ టైటలింగ్ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ బిల్లును కూడా సభ ఆమోదించింది.  ఈ బిల్లుపై సభలో చర్చను నిర్వహించారు.  భూములను పూర్తి స్థాయిలో రీ సర్వే చేస్తున్నామని మంత్రి ధర్మాన తెలిపారు.  దీనికోసం ప్రభుత్వం వెయ్యికోట్ల రూపాయల నిధులను కేటాయించినట్టు అయన పేర్కొన్నారు.  

అయితే, భూముల రీ సర్వే ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.  గతంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇలాంటి రీ సర్వే ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారని అన్నారు. 

ఆస్తిపన్నును పెంచుతూ రూపొందించిన మున్సిపల్ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.  దీనిపై కొంతసేపు సభలో గొడవ జరిగింది.  ఆస్తిపన్ను ఎంత శాతం పెంచుతున్నారనే అంశాన్ని బిల్లులో ప్రస్తావించలేదని టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.  పేదలపై భారం పడకుండా ఆస్తిపన్ను పెంచుతామని మంత్రి బొత్సా పేర్కొన్నారు.  15శాతానికి మించకుండా చూస్తామని బొత్స పేర్కొన్నారు.  
 
Follow Us:
Download App:
  • android
  • ios