పుష్కర ఘాట్‌లో తేలిన నాలుగు మృతదేహాలు.. స్నానం చేస్తూ మునిగిపోయారా..? లేక..?

four dead bodies found in kovvur pushkar ghat
Highlights

పుష్కర ఘాట్‌లో తేలిన నాలుగు మృతదేహాలు.. స్నానం చేస్తూ మునిగిపోయారా..? లేక..?

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోదావరి పుష్కరఘాట్‌లో నాలుగు మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది.. ఉదయం లాంచీలరేవు వద్దకు వెళ్లిన స్థానికులకు ఘాట్ వద్ద ఇద్దరు పురుషులు, మహిళ, బాలిక మృతదేహాలు తేలుతూ కనిపించాయి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు..వీరు ఆత్మహత్య చేసుకున్నారా..? స్నానానికి వచ్చి ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయారా..? లేక వీరిని చంపి అనుమానం రాకుండా ఉండేందుకు ఇక్కడ పడేశారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

loader