కృష్ణాజిల్లాలో (krishna district) పండుగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారులు చెరువులో (pond) శవాలుగా తేలారు. కైకలూరు (kaikaluru) మండలం వరాహపట్నం (varahapatnam) గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు.

కృష్ణాజిల్లాలో (krishna district) పండుగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారులు చెరువులో (pond) శవాలుగా తేలారు. కైకలూరు (kaikaluru) మండలం వరాహపట్నం (varahapatnam) గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. ఈత రాకపోవడం నలుగురు చిన్నారులు చెరువులో మునిగి అక్కడికక్కడే మృతి చెందారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

చనిపోయిన వారిలో ముగ్గురు బాలికలు, ఒక బాలుడు వున్నారు. చిన్నారులు మునిగిపోవడం గమనించిన స్థానికులు వచ్చేసరికి సమయం మించిపోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దసరా పండుగ పండుగ వేళ.. ఒకేసారి నలుగురు చిన్నారుల మరణించడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.