విశాఖపట్టణం: ఐదు వేల రూపాయాలను చెల్లించలేదని యువకుడిని నలుగురు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. ఈ దాడి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖపట్టణంలోని పరదేశిపాలెనికి చెందిన దంతేశ్వరరావు తన స్నేహితుడి వద్ద ఈ ఏడాది జనవరి మాసంలో రూ. 8 వేలకు టూ వీలర్ కొనుగోలు చేశాడు. టూ వీలర్ ను రూ. 8 వేలకు దంతేశ్వరరావు కొనుగోలు చేశాడు. రెండు మాసాల తర్వాత టూ వీలర్ కు సంబంధించిన డబ్బులు చెల్లిస్తానని దంతేశ్వరావు స్నేహితులకు చెప్పాడు. అయితే చెప్పిన సమయానికి దంతేశ్వరరావు స్నేహితులకు డబ్బులు చెల్లించలేదు.

ఈ విషయమై దంతేశ్వరరావును అతని స్నేహితులు నిలదీశారు.గొడవ జరిగింది. విషయం తెలుసుకొన్న దంతేశ్వరరావు తల్లి రూ. 3 వేలను చెల్లించింది. మిగిలిన రూ. 5 వేలు దంతేశ్వరరావు ఇంకా చెల్లించాల్సి ఉంది.ఈ డబ్బులు చెల్లించకపోవడంతో పాటు దంతేశ్వరరావు తమకు కన్పించకుండా తిరుగుతున్నాడని స్నేహితులు అతడిపై కక్ష పెంచుకొన్నారు. 

ఈ నెల 14వ తేదీనన విశాఖపట్టణంలోని మారికవలస ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్ వెనుక భాగంలో దంతేశ్వరరావును చెట్టుకు కట్టేసి నలుగురు చితకబాదారు. చిత్ర హింసలు పెట్టారు. చంపుతామని  బెదిరించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దంతేశ్వరరావుపై దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశాడు.దంతేశ్వరరావుపై దాడి చేసిన ఘటనలో ఇద్దరు మైనర్లు  కూడ ఉన్నారు. కొంత కాలంగా ఈ నలుగురు యువకులు ఈ రకంగా రౌడీయిజానికి పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు.