‘ఐ లవ్ యూ బంగారం.. నీతో మాట్లాడి…ఎన్నాళ్లయిందో..’ మాజీమంత్రి ముత్తంశెట్టి వాయిస్ తో ఆడియో వైరల్..

వైసీపీ మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వాయిస్ అని చెబుతున్న ఆడియో క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎవరో కావాలనే తన గొంతును ఇమిటేట్ చేశారని మాజీ మంత్రి ఆరోపిస్తున్నారు. 
 

former ycp minister mutham shetty srinivasa rao voice Audio viral

విశాఖపట్నం : ‘ఐ లవ్ యూ బంగారం.. ఐలవ్ యూ డార్లింగ్… నీతో మాట్లాడి…ఎన్నాళ్లయిందో.. ముందు నీ ఫోటో పంపు..  నాలుగో తేదీన ఢిల్లీలో కలుద్దామా’ అంటూ ఓ మహిళతో ఓ వ్యక్తి జరిపిన సంభాషణలు ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే, ఈ ఆడియో క్లిప్ లో ఉన్న గొంతు మాజీ మంత్రి, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు ముత్తంశెట్టి శ్రీనివాసరావుదేనంటూ కొన్ని చానళ్లు ఆయన ఫోటో తో సహా కథనాలు ప్రసారం చేయడంతో కలకలం రేగింది. అవంతి శ్రీనివాస్ గా అందరికీ పరిచితుడైన సంగతి తెలిసిందే. ఫోన్లో మాట్లాడిన మహిళ తాను హైదరాబాద్ లోని ‘ ‘ప్రియాంక  రెసిడెన్సీ’లోకే ఇల్లు మారుతున్న అని చెప్పింది. 

దీంతో అవతలి వ్యక్తి.. తన కుమార్తె చాలా షార్పు అని పసిగట్టేస్తుందని..  అక్కడికి ఎందుకని’ ప్రశ్నించారు. గతంలో ముత్తంశెట్టి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన విశాఖ నగరానికి చెందిన ఓ వివాహితతో ప్రేమపూర్వక సంభాషణలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిమీద ఆయన.. తన గొంతును అనుకరించి ఫేక్ సంభాషణలను రికార్డు చేశారని ఆయనసైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ కేసు దర్యాప్తు అధికారులు ఇంకా పూర్తి చేయలేదు. వాస్తవాలు ఏమిటన్నది బయటపడలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన గొంతును పోలిన మరో వాయిస్ క్లిప్పింగ్ వెలుగు చూడడం చర్చనీయాంశంగా మారింది.

ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు.. చర్యలు తీసుకోండి : వైసీపీ ప్రభుత్వానికి అచ్చెన్నాయుడు అల్టీమేటం

ఈ వ్యవహారంపై మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తన పీఏ ద్వారా ఫిర్యాదు చేయగా.. మళ్లీ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. దీనిమీద ముత్తంశెట్టి స్పందిస్తూ... 8నా కీర్తి ప్రతిష్టలను, రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా నా స్వరాన్ని పోలిన సంభాషణలు విడుదల చేశారు. నేను గత 15 రోజులుగా అయ్యప్ప స్వామి మాల లో ఉన్నాను. పది రోజుల కిందటే ఈ విషయం నా దృష్టికి వచ్చింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఈనెల 11న ఫిర్యాదు చేయించాను. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’ అన్నారు.

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ, కే భవాని ప్రసాద్ మాట్లాడుతూ... ‘మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుంటున్నాం. సంబంధిత సెక్షన్లతో కేసు నమోదు చేస్తాం. ఈ సంభాషణలు వేలమందికి చేరాయి. మొట్టమొదటి ఎవరు దీనిని సోషల్ మీడియాలోకి విడుదల చేశారన్నది తెలుసుకోవడానికి సమయం పడుతుంది’ అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios