ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ మధ్యలో చేతులెత్తేశాడని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆరోపించారు.సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  ఈ ఎన్నికల్లో నిమ్మగడ్డ ఐస్‌గడ్డలా కరిగిపోయారని ఆయన  ఎద్దేవా చేశారు. 1952 నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నికలను మొట్టమొదటిసారి చూస్తున్నానట్టుగా చెప్పారు.  

నెల్లూరు: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ మధ్యలో చేతులెత్తేశాడని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆరోపించారు.సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో నిమ్మగడ్డ ఐస్‌గడ్డలా కరిగిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. 1952 నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నికలను మొట్టమొదటిసారి చూస్తున్నానట్టుగా చెప్పారు. 

ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారని ఆయన మండిపడ్డారు. కర్నాటక, తెలంగాణ లిక్కర్, ఎర్రచందనం అక్రమ కేసులు పెడతామని పోటీదారులను బెదిరించి, భయపెట్టి సగానికిపైగా ఏకగ్రీవాలు చేసేలా వైసీపీ నేతలు చేశారని చింతామోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక, నగర పాలక సంస్థ ఎన్నికలు ఫేక్ ఎన్నికలని ఆయన తెలిపారు.

 రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎన్నికల కమిషనర్ పదవి చేపట్టకూడదని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం శుభ సూచికమని చెప్పారు. రూ.300 కోట్లతో టీటీడీ చిన్న పిల్లల ఆస్పత్రి నిర్మాణం చేస్తామని ఎన్నికలకు ముందు ఎంఓయూ చేసుకోవడం ఒక రాజకీయ జిమ్మిక్కు అని వ్యాఖ్యానించారు. రూ. 300 రూపాయలు లేని అతను మూడు వందల కోట్లు పెట్టి ఆస్పత్రిని ఎలా నిర్మిస్తాడని చింతామోహన్ ప్రశ్నించారు.